మనవరాలిని చూసుకోవడానికి గంటకు రూ. 1600 ఛార్జ్‌ చేస్తున్న అమ్మమ్మ

-

తల్లిదండ్రుల కంటే.. తాతబామ్మలే.. ఇంట్లో చిన్నపిల్లలను బాగా చూసుకుంటారు. వారిని ఆడిస్తూ, వేళకు ఆహారం పెడుతూ, బయటకు తీసుకెళ్లడం అన్నీ వీళ్లే ఎక్కువ చూసుకుంటారు. ఇంట్లో తాతోబామ్మో ఉంటో.. పేరెంట్స్‌కు చాలా రిలీఫ్‌గా ఉంటుంది. అచ్చంగా ఫారిన్‌లో ఉన్న పిల్లలను చూసుకోవడానికే వృద్ధులు వెళ్తుంటారు. ఇక్కడ ఓ బామ్మ తన మనవరాలిని చూసుకోవడానికి గంటకు 1600 వసూలు చేస్తుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

సాధారణంగా.. ఇంట్లో ఉండే..వృద్ధులకు ఏ పనిపాట ఉండదు, వాళ్లకు జాబ్‌ కూడా లేదు, సంపాదన లేదు అని చాలామంది తక్కువగా చూస్తారు. వాళ్లు ఇంట్లో ఉండి చేసే చిన్నపనికి డబ్బులు వసూలు చేస్తే.. అది ఒక కార్పొరేట్‌ ఎంప్లాయ్‌ జీతం కంటే ఏమాత్రం తక్కువ కాదని ఈ బామ్మ నిరూపించింది. ఆఫీస్‌ పనుల్లో బిజీగా ఉన్నామని తన కూతుర్ని చూసుకోమని ఓ మహిళ తన తల్లిని కోరింది. ఆ బామ్మ గంటకు 16 పౌండ్లు ఇస్తే మనవరాలి బాధ్యతలు తీసుకుంటా అని తెగేసి చెప్పిందట. ఇది ఇక్కడి స్టోరీ కాదులేండి.. బ్రిటన్‌లోది.

వీటితో పాటు లైట్‌ అయితే పెనాల్టీ కూడా వేస్తా అని ఆ బామ్మ చెప్పిందట. దీంతో షాక్‌ అయినా కూతూరు వాళ్ల అమ్మను ఒప్పించే పనిలో ఉంది. ఒకవేళ ఒప్పుకోకపోతే.. తన కుమార్తెను డే కేర్‌ సెంటర్‌కు పంపుతానని ఆ మహిళ చెప్పింది. ఇంత డబ్బు ఇస్తే.. మేం అప్పులపాలవుతామని ఆ మహిళ పేర్కొంది. ఈ వార్త బ్రిటన్‌లోవైరల్‌ అవడంతో.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కమెంట్‌ చేశారు. కొందరు అమ్మాయిని సమర్థిస్తుంటే.. మరికొందరు ఆ బామ్మను సమర్థిస్తున్నారు.

7 Ways to Support a Grandchild's Mental Health | MGH Clay Center

ఇలానే అందరూ అమ్మమ్మలు, నాయనమ్మలు చేస్తే ఎలా ఉంటుందో. కదా..! మన దగ్గర కూడా.. చాలా మంది వృద్ధులు తమ మనవళ్లను, మనవరాళ్లను చూసుకుంటారు. అయినా కొందరు వారిని అస్సలు గౌరవించరు. ఖాళీగా ఉండి.. విసిగిస్తుంది అని చీప్‌గా చూస్తారు. పింఛన్‌ డబ్బుల కోసం ఆసపడేవాళ్లు.. ఇలా గంటకు ఇంత ఇవ్వమంటే.. ఏం అవుతారో..!

Read more RELATED
Recommended to you

Latest news