కిషన్ రెడ్డికి మగాడే దొరకలేదా అంటూ రాజాసింగ్ ఫైర్!

-

కిషన్ రెడ్డికి మగాడే దొరకలేదా అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయినట్లు సమాచారం అందుతోంది. హైదరాబాద్ పార్లమెంట్ పోటీ చేయాలనుకున్న రాజా సింగ్‌ను కాదని విరంచి హాస్పిటల్ ఓనర్ డాక్టర్ మాధవీ లతకు అధిష్టానం టికెట్ కేటాయించింది. హైదరాబాద్ పార్లమెంట్ నుండి పోటీ చేయించడానికి కిషన్ రెడ్డికి మగాడే దొరకలేదా అంటూ రాజా సింగ్ ఏకంగా కిషన్ రెడ్డి మీదే విమర్శనాస్త్రాలు సంధించారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారాయి.

rajasingh fires on kishan reddy

ఇక అటు బీజేపీ పార్టీ ఎంపీలు ధర్మపురి అరవింద్ వర్సెస్‌ బండి సంజయ్ మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. బండి సంజయ్‌ను డైరెక్టుగా విమర్శించారు ధర్మపురి అరవింద్. బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా తొలగించడం వల్లే బీజేపీ గ్రాఫ్ పడిపోయింది అంటే నేను ఒప్పుకోనని తెలిపారు బీజేపీ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్.ఓ టీవీ ఛానల్ లో చర్చా కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news