బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో యూపీఐ మోసాలకు పాల్పడుతున్న రాజస్థాన్ ముఠా..!

-

బజాజ్ ఎలక్ట్రానిక్స్‌ను టార్గెట్ గా చేసుకొని యూపీఐ మోసాలకు పాల్పడుతోంది రాజస్థాన్ ముఠా. మూడు కమిషనరేట్లతో పాటు తెలంగాణ వ్యాప్తంగా సుమారు నాలుగు కోట్ల రూపాయల యూపీఐ మోసాలకు ఈ ముఠా పాల్పడినట్టు సమాచారం. బజాజ్ ఎలక్ట్రానిక్స్ పిర్యాదు మేరకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. వీరు ముందుగా వస్తువులు కొనడానికి ఎలక్ట్రానిక్స్ షోరూం లోకి రాజస్థానీ ముఠాలోని సభ్యులు వెళ్తారు. ఆ తరువాత విలువైన వస్తువులు కొనుగోలు చేశాక యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తారు.

యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడానికి బజాజ్ షోరూమ్ లోని క్యూఆర్ కోడ్‌ను రాజస్థాన్ లోని తమ సహచరులకు ఈ ముఠా సభ్యులు పంపుతున్నారు. ఆ తరువాత అక్కడి నుంచి క్యూఆర్ కోడ్ తో రాజస్థాన్ లోని సహచర ముఠా సభ్యులు పంపుతున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు డెలివరీ అయ్యాక పొరపాటున వేరే ఖాతాకు డబ్బు బదిలీ చేశామంటూ చార్జ్ బ్యాక్ ఆప్షన్ ద్వారా తిరిగి డబ్బు పొందుతున్నారు. రాజస్థాన్ కు చెందిన 20 నుంచి 25 ఏళ్ల వయసు ఉన్న యువకులంతా కలిసి ముఠాగా ఏర్పడ్డారు. యూపీఐ మోసాల ద్వారా కొనుగోలు చేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఇతరులకు అమ్మి ఈ ముఠా సొమ్ము చేసుకుంటుంది. గత రెండు నెలలుగా వీరు 1125 యూపీఐ ట్రాన్స్‌యాక్షన్స్‌ చేశారు. ఈ ముఠాకు చెందిన వారిలో హైదరాబాద్ కు చెందిన 13 మందిని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రైమ్ వెనకాల ఉన్న కింగ్ పిన్ ను ఇప్పటికే  పట్టుకున్నట్టు తెలిపారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version