కుల, మతాలను ఏకం చేయాలనే రాజీవ్ సద్భావన యాత్ర చేపట్టారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. హైదరాబాద్ చార్మినార్ లో రాజీవ్ సద్భావన యాత్ర సందర్భంగా మాజీ మంత్రి గీతారెడ్డికి రాజీవ్ సద్భావన అవార్డు అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతరత్న రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారు. దేశాన్ని సమగ్రంగా ఉంచేందుకు ఇందిరాగాంధీ ప్రాణాలు అర్పించారు. రాజీవ్ గాంధీ స్పూర్తిని కొనసాగించడం అభినందనీయమన్నారు.
కాంగ్రెస్ పాలనతో బడుగు, బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. వేలాది కోట్ల రూపాయలను నెహ్రు దేశం కోసం ఇచ్చారు. ఆస్తులను త్యాగం చేసి నెహ్రు స్వాతంత్య్రం కోసం పోరాడారు. మతసామరస్యానికి ప్రతీక అని రాజీవ్ గాంధీ నమ్మారు. నియంత పాలనను గద్దె దించడం కోసం గీతారెడ్డి త్యాగం చేశారు. ప్రస్తుతం ఎవరైనా టికెట్ కోసం పోటీ పడతారు. కానీ గీతారెడ్డి టికెట్ తనకు వద్దు.. మంచి వ్యక్తికి టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరడం గొప్ప విషయం అన్నారు.