పొంగులేటి కోసం రాజకీయాల్లోకి RS రీ ఎంట్రీ

-

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏ పార్టీలో చేరతారనే విషయంపై గందరగోళంపై తాజాగా స్పష్టత వచ్చింది. ఆయన కాంగ్రెస్​లో చేరడం దాదాపు ఖాయమైపోయింది. అయితే పొంగులేటిని కాంగ్రెస్​లోకి చేరేందుకు ప్రేరేపించడం వెనక ఓ కీలక వ్యక్తి ప్రమేయం ఉందట. ఆ వ్యక్తే.. రామసహాయం సురేందర్‌రెడ్డి (ఆర్‌ఎస్‌).

వరంగల్‌ మాజీ ఎంపీ అయిన సురేందర్ రెడ్డి ఉమ్మడి వరంగల్‌లోని రాజకీయ నేతలకు సుపరిచితమే. 27 ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు రవి తదితర రాష్ట్ర నాయకులు పొంగులేటితో భేటీ అయిన విషయం తెలిసిందే. అంతర్గతంగా జరిగిన రాజకీయ చర్చల్లో సురేందర్‌రెడ్డి సైతం పాల్గొన్నారు. ఈ క్రమంలో వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ రాజకీయాల్లో ఆర్‌ఎస్‌ తిరిగి క్రియాశీల పాత్ర పోషిస్తారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఆయన రీ ఎంట్రీ ఇస్తే మాత్రం.. ఈ ప్రాంత రాజకీయాలపై రానున్న రోజుల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news