అమీర్ పేట్ లో దారుణం…ఇంటర్యూకు వచ్చిన యువతిపై లైంగిక దాడి ?

-

అమీర్ పేట్ మధురానగర్ లో దారుణం చోటుచేసుకుంది. జాబ్ ఇంటర్వ్యూ కు వచ్చిన యువతిపై అత్యాచారయత్నం చేశారు. ఇంటర్వ్యూ కు వచ్చిన యువతిని సెలెక్ట్ అయ్యావని చెప్పి.. ఆఫీసు సిమ్ కార్డ్ ఇచ్చే సాకుతో ఇంటికి పిలిపించుకున్నాడు ఓ సాఫ్ట్వేర్ సంస్థ మేనేజర్.

Rape attempt on a young woman who came for a job interview

దీంతో ఇంటికి వచ్చిన యువతిపై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు ఆ మేనేజర్ నవీన్ కుమార్. అయితే..నవీన్ కుమార్ నుంచి చాక చాక్యంతో తప్పించుకుంది ఆ యువతి. అనంతరం పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంంతో నిందితుడు నవీన్ కుమార్ ను అరెస్టు చేశారు మధురానగర్ పోలీసులు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news