మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. దిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సరదాగా ముచ్చటించారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టిన తర్వాత అక్కడి వాతావరణం, శాసనసభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చూసి షాకయ్యానని, ఆ తర్వాత లాబీలో ఒకరితో ఒకరు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూసి ఆశ్చర్యపోయానని సినీ నటుడు చిరంజీవి అన్నారు.
అయితే సభలో అందరు నేతలు దుర్భాషాలడటం చూశాను కానీ, మీరు మాత్రం సంయమనం కోల్పోకుండా మీరు చెప్పాలనుకున్న విషయం కచ్చితత్వంతో సభ ముందు ఉంచే వారని కిషన్ రెడ్డిని ఉద్దేశించి చిరు అన్నారు. ఒకరకంగా సభా మర్యాద తాను కిషన్ రెడ్డి నుంచే నేర్చుకున్నానని తెలిపారు. మరోవైపు కిషన్ రెడ్డి కూడా తన రాజకీయ జీవితంలోని కొన్ని సంఘటనల గురించి చిరుతో షేర్ చేసుకున్నారు. మొదటి సారి మోదీని కలిసిన క్షణాలు, ఆరోగ్య శ్రీ పథకానికి ఎలా బీజం పడింది వంటి అంశాల గురించి ఇరువురు చర్చించారు.
G20 మీటింగ్ శ్రీనగర్ లో పెట్టడానికి మోడీ గారు అన్ని రకాలుగా సహకరించారు. ఇప్పుడు ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత గత రెండు సంవత్సరాల్లోనే దాదాపు 300 పైగా సినిమా షూటింగులు కాశ్మీర్లో జరిగాయి..@KChiruTweets pic.twitter.com/zxgCtuCs4e
— G Kishan Reddy (Modi Ka Parivar) (@kishanreddybjp) May 9, 2024