వరంగల్ BRS ఎంపీ అభ్యర్థిగా రసమయి బాలకిషన్ ?

-

వరంగల్ లో అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తానని రసమయి బాలకిషన్ కామెంట్ చేశారు. ఇవాళ తెలంగాణ భవన్‌ లో రసమయి బాలకిషన్ మాట్లాడుతూ… ఆట పాటల వల్ల తెలంగాణ రాలేదు అని కె.కేశవరావు అన్నారు…ఆ మాటలు వెనక్కి కేకే వెనక్కి తీసుకోవాలని ఫైర్ అయ్యారు. తెలంగాణ అమరవీరులస్థూపం వద్దకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంను అవమానించడం దారుణమన్నారు.

rasamai balakishan on warangal brs mp candidate

పాట లేకుంటే లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదన్నారు రసమయి బాలకిషన్. ముసలితనం కు వచ్చిన కేకే మతి భ్రమించి మాట్లాడు తున్నారు…కాంగ్రెస్ లో పట్టించుకోని కేకే కు brs లో ఎన్నో పదవులు ఇచ్చారు కేసీఆర్ అంటూ కామెంట్స్‌ చేశారు రసమయి బాలకిషన్. కడియం శ్రీహరి కి ఏమి తక్కువ చేశాము అని పార్టీ మారిపోయారు….కడియం శ్రీహరి ని రాజకీయంగా బొంద పెట్టడానికి వరంగల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు సీట్ల విషయం లో అన్యాయం చేసిందని ఫైర్‌ అయ్యారు రసమయి బాలకిషన్.

Read more RELATED
Recommended to you

Latest news