దేవరకొండలో రవీంద్ర కుమార్ గెలుపు ఖాయం : సీఎం కేసీఆర్

-

దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గెలుపు ఖాయమని సీఎం కేసీఆర్ పేర్కన్నారు. ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. మంచి వ్యక్తిని గెలిపించుకుంటే మంచి జరుగుతుంది. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ దేవరకొండలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కావాలని అడిగారు. ఆయనను గెలిపిస్తే తీసుకొచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసులు వేసి ఆపడం వల్ల డిండి లిప్ట్ ఇరిగేషన్ పెండింగ్ పడింది. రాబోయే కొద్ది డిండి లిప్ట్ ఇరిగేషన్ పూర్తవుతుంది. 5 రిజర్వాయర్లు ఒక బ్యారేజ్ దేవరకొండలో వస్తూంది. తెలంగాణ రాక ముందు పరిస్థితి ఎలా ఉంది.. ఆరోజు ఎలా ఉంది. మంచి నీటి సమస్య, తాగునీటి సమస్య తీర్చుకున్నాం. అన్ని తండాలను గ్రామపంచాయతీలను చేసుకున్నాం. వెనుకబడిన ప్రాంతం.. అద్భుతమైన నాయకుడు రవీంద్ర కుమార్ ని గెలిపించాలని కోరారు. దేవరకొండ చరిత్రలో ఇదే పెద్ద మీటింగ్ అని అనుకుంటున్నాను.. మిమ్మల్ని చూస్తుంటే.. 70వేల మెజార్టీతో గెలిపిస్తారని భావిస్తున్నాను.

Read more RELATED
Recommended to you

Latest news