మూసీ సుందరీకరణకు తాము అనుకూలమేనని.. అయితే సుందరీకరణ పేరిట స్థిరాస్తి వ్యాపారానికి వ్యతిరేకమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. మూసీ పేరిట కమీషన్లు, పేదల ఇళ్లను కూల్చడం వంటి వాటిని వ్యతిరేకిస్తున్నామన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసిత కాలనీ రాజమౌళి సినిమాను తలిపిస్తోందంటూ ఎద్దేవా చేశారు. మూసీ బాధితులకు మల్లన్న సాగర్ కి మించిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు.
మూసీ బాధితులకు గచ్చిబౌలి భూముల్లో ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్నారు. హైదరాబాద్ నుంచి వాడపల్లి వరు పాదయాత్ర చేద్దామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా పాదయాత్రకు రావాలన్నారు. మమ్మల్ని డీల్ చేయడం కాదు.. రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకోవాలన్నారు. పక్కనున్న వాళ్లే ఆయనను దించేయకుండా జాగ్రత్త పడాలన్నారు. ప్రభుత్వం వచ్చి ఏడాదైనా.. 6 మంత్రి పదవులు నింపుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు 100 సీట్లు రావడం ఖాయమని హరీశ్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.