నిమజ్జనం ఎఫెక్ట్.. ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు

-

గణేశ్ నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. నిన్న ఒక్కరోజులోనే మెట్రోలో 4 లక్షల మంది ప్రయాణించినట్లు మెట్రో సంస్థ తెలిపింది. మియాపూర్- ఎల్​బీ నగర్ కారిడార్​లో 2.46 లక్షల మంది,

నాగోల్-రాయదుర్గ్ కారిడార్​లో 1.49 లక్షల మంది, జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్​లో 22 వేల మంది ప్రయాణించినట్లు హైదరాబాద్​ మెట్రో ప్రకటించింది.గణేశ్ నిమిజ్జనం నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంచడంతో ప్రయాణికులు అధిక సంఖ్యలో మెట్రోను వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు.

అత్యధికంగా ఖైరతాబాద్ మెట్రోస్టేషన్​లో 62 వేల ఫుట్​ఫాల్ నమోదైంది. ఖైరతాబాద్ స్టేషన్​లో 40 వేల మంది రైలు దిగగా.. 22 వేల మంది రైలు ఎక్కారు. గతంలో కరోనా కంటే ముందు మెట్రోలో 4 లక్షల ప్రయాణికులు సరాసరిగా రోజున ప్రయాణించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news