Mirchi Price : ఖమ్మం మార్కెట్​లో మిర్చికి రికార్డు ధర

-

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి పంటకు రికార్డు ధర పలికింది. తేజ రకం కొత్త మిర్చి ఇవాళ.. ఖమ్మం మార్కెట్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయింది. క్వింటాల్‌ మిర్చికి రూ. 25,550 పలకడం ఇదే ప్రథమం. ఇవాళ ఖమ్మం వ్యవసాయ మిర్చి మార్కెట్‌లో నిర్వహించిన జెండా పాటలో మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ పాల్గొని జెండా పట్టుకుని ధర నిర్ణయించారు.

ఖమ్మం మార్కెట్‌లో తేజ ర‌కం కొత్త మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికిందని మంత్రి పువ్వాడ అన్నారు. ఖమ్మం మార్కెట్‌ను అంతర్జాతీయ మార్కెట్‌కు చిరునామాగా తీర్చిదిద్దుతామని.. చిల్లీస్‌కు హబ్‌గా చేస్తామని తెలిపారు. కొన్ని క్వింటాలే కాదు.. రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చిన ప్ర‌తి బ‌స్తాను కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని భరోసా కల్పించారు.

తెలంగాణ ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి కృషి చేస్తుందని మంత్రి పువ్వాడ తెలిపారు. తెలంగాణ మిర్చికి అంతర్జాతీయ మార్కెట్​లో మంచి డిమాండ్ ఉందని వెల్లడించారు. రైతుల మీద ప్ర‌భుత్వానికి ప్రేమ ఉంద‌ని, అందుకే రైతుల ప్రయోజనాల‌ను కాపాడుతున్నామ‌ని మంత్రి పువ్వాడ అజ‌య్ స్ప‌ష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news