ఇవాళ్టి నుంచి తెలంగాణ రాష్ట్రానికి మూడు రోజుల పాటు భారీ వర్ష సూచనలు ఉన్నట్లు ఐఎండీ ప్రకటించింది. దీంతో నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఇటు హైదరాబాద్ కు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.
ఇవాళ 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని..ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది ఐఎండీ. ఈ మేరకు జిల్లాల యంత్రాంగాలను అలెర్ట్ చేసిన వాతావరణ శాఖ.. అవసరమైతే తప్ప బయటకు రావద్దని ఐఎండీ సూచనలు చేసింది. పంటపొలాల్లో పని చేసే వారు చెట్ల కింద.. ఎత్తైన ప్రదేశాల్లో ఉండొద్దని కోరింది ఐఎండీ.