తెలంగాణ రాష్ట్ర రైతులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 10 నుంచి రైతు బీమా పథకానికి నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. కొత్తగా అర్హులైన రైతులను ఈ పథకంలో చేర్చాలని వ్యవసాయ శాఖను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఆగస్టు 5 వరకు నమోదు ప్రక్రియ కొనసాగనుంది. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. జూన్ 18 వరకు పట్టాదారు పాసుపుస్తకం పొందిన రైతులు మాత్రమే అర్హులు. కాగా ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రైతు బంధు నిధులను కేసీఆర్ సర్కార్ రిలీజ్ చేసిన సగంతి తెలిసిందే. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 10 నుంచి రైతు బీమా పథకానికి నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది.