పేదలకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త…వారికి 125 గజాల భూములు ఉచితంగా క్రమబద్దీకరణ !

-

పేదలకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది.ప్రభుత్వ భూముల్లో నిర్మాణాల క్రమబద్దీకరణకు.. ఇవాళ్టి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చే నెల 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు 125 గజాల దాకా ఉచితంగా క్రమబద్దీకరించనున్నారు.

ప్రభుత్వ భూము ల్లో నిర్మాణాలు చేప ట్టిన చోట.. క్రమ బద్దీకరణ కు సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆక్రమణదారులు 2014 జూన్‌ 2 కి ముందు నుంచే ఆ స్థలంలో నివాసం ఉంటున్నట్లు నిర్థారించే ఆధారాలతో మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఈ నెల14న రెవెన్యూ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న సంగతి విధితమే. జీవో ఎంఎస్‌ 14 ను అనుసరించి సోమవారం నుంచి వచ్చే నెల 31 దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్రం లో నిర్వహించిన క్రమ బద్దీకరణ ప్రక్రియ కు 2014 డిసెంబర్‌ 30న జారీ చేసిన ఎంఎస్‌ 58, 59 ప్రకారం నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news