గుడ్ న్యూస్.. నేటి నుంచి క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్వీకరణ

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి ప్ర‌భుత్వ భూముల్లో నిర్మాణాల క్ర‌మ‌బ‌ద్ధీర‌ర‌ణ‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ సేవా కేంద్రాల నుంచి క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌కు ద‌ర‌ఖాస్తుల ను రాష్ట్ర ప్ర‌భుత్వం స్వీక‌రించ‌నుంది. కాగ వ‌చ్చే నెల 21 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌నున్నారు. కాగ రాష్ట్రంలో దారిద్య్ర రేఖ‌కు దిగువ ఉన్న కుటుంబాల‌కు 125 గ‌జాల వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉచితం గా క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ చేయ‌నుంది.

దీనికి మించి ఉంటే.. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం రుసం చెల్లించాల్సి ఉంటుంది. కాగ క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ కోసం వ‌చ్చే ద‌ర‌ఖాస్తు దారులు.. ఆయా ప్ర‌భుత్వ భూముల్లో 2014 జూన్ 2 కి ముందు నుంచే నివాసం ఉండాలి. అలాగే దానిని నిర్ధారిస్తు.. ఆధారాలతో మీ సేవా కేంద్రాల్లో ద‌ర‌ఖాస్తు చేయాలి. కాగ ప్ర‌భుత్వ భూముల్లో నిర్మాణాల పై క్ర‌బ‌ద్ధీక‌ర‌ణ చేస్తామ‌ని ఇటీవ‌ల తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దానికి అనుగూణంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ ఈ నెల 14 న దానికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. జీవో ఎంఎస్ 14 ను ఆధారం గా నేటి నుంచి క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌కు ద‌రఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news