కెప్టెన్ గా వాషింగ్టన్ సుందర్.. జట్టులో ఐపీఎల్ స్టార్స్ !

-

ప్రస్తుతం ఇండియా వేదికగా వన్ డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ జరుగుతోంది. ఇండియా హాట్ ఫేవరెట్ గా రంగంలోకి దిగనుంది. ఎలాగైనా కప్ ను సాధించాలన్న కసితోనే రోహిత్ శర్మ సారథ్యంలో ఆటగాళ్లు అందరూ కసితో ఉన్నారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 16వ తేదీ నుండి దేశవాళీ టోర్నమెంట్ జరగనుంది.. సయ్యద్ ముస్తాక్ అలీ పేరుతో టీ 20 టోర్నమెంట్ జరగనుంది. కాగా ఈ సీజన్ కు తమిళనాడు జట్టుకు కెప్టెన్ గా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను నియమించింది. కాగా ఈ తమిళనాడు జట్టులో ఐపీఎల్ లో ఆడిన అనుభవం ఉన్న స్టార్లు ఉండడం విశేషం. వాషింగ్టన్ సుందర్ కెప్టెన్ కాగా, సాయి సుదర్శన్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ సేన్, నారాయణ జగదీశన్, విజయ్ శంకర్, షారుఖ్ ఖాన్, నటరాజన్ లాంటి స్టార్లు బరిలోకి దిగుతున్నారు.

మరి సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీని గెలుచుకుంటారా చూడాలి. ఇక వరల్డ్ కప్ లో చోటు కోసం చివరి వరకు ప్రయత్నించిన సుందర్ ఆఖరికి అశ్విన్ ను జట్టులకి తీసుకోవడంతో వెనుతిరిగాడు.

Read more RELATED
Recommended to you

Latest news