గాంధీభవన్లో తెలంగాణ మేనిఫెస్టో విడుదల అయింది. కాసేపటి క్రితమే మేనిఫెస్టోను విడుదల చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ.
ఈ కార్యక్రమంలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి పాల్గొన్నారు.
ఇది ఇలా ఉండగా, రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. అమేఠీ నుంచి గాంధీ కుటుంబ విధేయుడు కిషోరీ లాల్ శర్మ బరిలో దిగనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. అయితే మొదట అమేఠి నుంచి రాహుల్ గాంధీ, రాయ్బరేలి నుంచి ప్రియాంకా గాంధీ పోటీలో నిలుస్తారని అంతా భావించారు. కానీ ప్రియాంకా తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పడంతో బరిలో నిలిచేదెవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
https://x.com/Hema_Journo/status/1786276245912891882