ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంట్ లో రెండో రోజు చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా లోక్ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. పహల్గామ్ లో కుటుంబ సభ్యుల ముందే ఉగ్రవాదులు చంపేశారు. పాకిస్తాన్ రెచ్చిపోయి వ్యవహరిస్తోంది.ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రమూకలపై బదులు తీర్చుకున్నామని తెలిపారు. పాకిస్తాన్ రెచ్చిపోయి సరిహద్దుల్లో హిందూ ఆలయాలు, సామాన్య ప్రజలను టార్గెట్ చేస్తుందని పేర్కొన్నారు.
ఆపరేషన్ మహాదేవ్ పై లోక్ సభలో హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ మహదేవ్ తో పహల్గామ్ లో దాడి చేసిన ఉగ్రవాదులను మట్టు పెట్టామని తెలిపారు. టెర్రరిస్టులు ఉగ్రదాద దాడి తరువాత పాకిస్తాన్ కి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ సరిహద్దు దాటేందుకు అవకాశం ఇవ్వలేదని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులతో మీటింగ్ పెట్టి సరిహద్దు దాటకుండా వారిని మట్టుబెట్టామని తెలిపారు. ఈనెల 22న ఉగ్రమూకను గుర్తించామని.. సులేమాన్, అబూ, యాసిన్ లను బలగాలు మట్టుపెట్టాయని తెలిపారు.