సుంకిశాల ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థను బ్యాన్ చేయండంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని పేర్కొన్నారు. కాళేశ్వరం మీద మేడిగడ్డ మీద వచ్చిన ఎన్డీఎస్ఏ, కేంద్ర సంస్థలు సుంకిశాల మీద ఎందుకు రావడం లేదని ఆగ్రహించారు. సుంకిశాల ఘటన మీద ఒక్క బీజేపీ నేత కూడా ఎందుకు మాట్లాడటం లేదని మంండిపడ్డారు కేటీఆర్.
దీనిపై ఒక జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయండి, ఆ నిర్మాణ సంస్థను బ్యాన్ చేయండి అంటూ డిమాండ్ చేశారు కేటీఆర్. ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత పురపాలక శాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ దేనని… అసెంబ్లీ సమావేశం రేవంత్ రెడ్డి అసమర్థత చేతగానితనం సేవ లేని తనం వల్లనే సుంకిశాల ప్రమాదం జరిగిందని ఆగ్రహించారు. ప్రభుత్వం తప్పు లేకుంటే ఎందుకు వారం రోజులపాటు దాచి ఉంచిందని మండిపడ్డారు కేటీఆర్. ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల, పర్యవేక్షణ లోపం వల్ల సుంకిశాల ప్రాజెక్ట్ గోడకూలి మన రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు.