బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తమపై రేవంత్ సర్కార్ అబద్ధపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సుంకిశాల ప్రాజెక్టు రిటెయినింగ్ వాల్ కూలిన ఘటనపై కేటీఆర్ స్పందించారు. సుంకిశాల ప్రాజెక్టుపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ నీటి అవసరాల కోసం సుంకిశాల ప్రాజెక్టు మెుదలు పెట్టారని.. సుంకిశాల ప్రాజెక్టుకు పునరుజ్జీవనం తెచ్చిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వం అని తెలిపారు. నాగార్జునసాగర్‌లో డెడ్‌స్టోరేజ్ ఉన్నా హైదరాబాద్‌కు నీటి కష్టాలు రాకూడదనే ఈ ప్రాజెక్టు చేపట్టామని వివరించారు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు సాగు, తాగునీటి కోసం ఉపయోగపడుతుందని.. కృష్ణానదికి నాలుగేళ్లు నీరు రాకపోయినా సుంకిశాల ప్రాజెక్టుతో నీటి ఇబ్బందులు రావని చెప్పారు.
తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడుతూ.. ‘బెంగళూరు, దిల్లీ, చెన్నైలో నీటి ట్యాంకర్ల కోసం ప్రజలు పోరాడుతున్నారు. హైదరాబాద్‌లో నీటి కోసం ఇబ్బందులు పడే పరిస్థితి లేదు. హైదరాబాద్‌కు 50 ఏళ్లు తాగునీటి అవసరాలకు సరిపడేలా ప్రణాళికలు చేశాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుంకిశాల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు. సుంకిశాల ప్రాజెక్టు డ్యామేజ్‌పై శాసనసభలో ఎందుకు ప్రకటన చేయలేదు. అని అన్నారు.