తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు బిగ్ అలర్ట్. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. పంచాయతీ రాజ్ అలాగే గ్రామీణ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పడం జరిగింది. ఈ ఉద్యోగులకు రెగ్యులర్ జీతాలు ఇవ్వాలని.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు… తెలంగాణ మంత్రి సీతక్క అధికారులకు కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ లో ఏకకాలంలో జీతాల చెల్లింపు జరిగేలా కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు… అధికారులు చెబుతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే…. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు… ఒకటో నెల జీతాలు పడతాయి అన్నమాట. అలా చేస్తే ఎవరైనా లోన్లు కట్టుకోవచ్చని… ఒకటో తేదీన డబ్బులు వస్తే.. తమ అవసరాలు తీరుతాయని… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట. అయితే ఇది త్వరలోనే అమల్లోకి రాబోతుందట.