‘నేనా పని చేయలేదు.. తడి బట్టలతో ప్రమాణానికి సిద్ధం’.. ఈటలకు రేవంత్ ఛాలెంజ్ విసిరారు. నిన్న ఈటెల వ్యాఖ్యలపై భగ్గుమన్న రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మునుగోడు ఎలక్షన్ లో బి.ఆర్.ఎస్ దగ్గర పైసలు తీసుకున్నట్టు నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. ఇవాళ సాయంత్రం 5గం.లకు తడి బట్టలతో భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తానని పేర్కొన్నారు.
దమ్ముంటే రావాలని ఈటెలకు సవాల్ విసిరారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఒక వేళ నువ్వు రాకపోతే… నేనే వస్తా ఎక్కడి రావాలో చెప్పు ఈటెల అంటూ నిలదీశారు రేవంత్ రెడ్డి. బీజేపీ పార్టీలో చేరినకా పూర్తిగా దిగజారి మాట్లాడుతున్నారు… ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, తాము సహించబోమని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. కాగా నిన్న మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి సీఎం కేసీఆర్ పార్టీ ఫండ్ ఇచ్చాడని.. అందువల్లే బీఆర్ఎస్ విజయం సాధించిందని ఆరోపణలు చేశారు.