తెలంగాణ లా అండ్ ఆర్డర్ విషయంలో రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో సీరియస్ గా వ్యవహరించాలని డీజీపీకి సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు మధ్యాహ్నం పోలీస్ యంత్రాంగంపై పూర్తి రివ్యూ చేయనున్న సీఎం రేవంత్… శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. తెలంగాణ, హైదారాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పనవి హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి.