జనవరి 26వ తేదీ నుండి జూన్ రెండవ తేదీ వరకు టిపిసిసి చీప్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర చేపడతారని తెలిపారు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. పాదయాత్రలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పార్టీలో విభేదాలు ఏమీ లేవని.. అందరం కలిసికట్టుగానే ఉన్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్యామిలీ లాంటిదని.. ఎలాంటి సంక్షోభం లేదన్నారు.
పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా ఎవరైనా పని చేస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవన్నారు. రాష్ట్రంలో బిఆర్ఎస్, కేంద్రంలోని బిజెపి పార్టీలు తమ స్వార్థం కోసం ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. బిజెపి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాదని.. పెట్టుబడిదారుల ప్రభుత్వమన్నారు సుదర్శన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూమి, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళిత బంధు, నిరుద్యోగ భృతి ఇలా ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిందని మండిపడ్డారు.