టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి భద్రతా సిబ్బంది షాక్ ఇచ్చారు. ఆయనకు భద్రతగా ఉన్న నలుగురు గన్‌మెన్లు బుధవారం రాత్రి నుంచి విధులకు రావడం లేదు. రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 4 ప్లస్ 4 గన్‌మెన్లు ఉండగా.. ఎంపీ అయిన తర్వాత ఆ సంఖ్యను 2 ప్లస్ 2కి కుదించారు. ఇటీవల ఆయన పాదయాత్ర చేసిన సమయంలో భద్రత కల్పించాలంటూ హైకోర్టులో వ్యాజ్యం వేయగా… 69తో భద్రత కల్పించినట్టు రేవంత్ వర్గీయులు తెలిపారు. యాత్ర తరువాత తిరిగి 2 ప్లస్ 2 గన్‌మెన్లు మాత్రమే విధులు నిర్వహిస్తూ వచ్చారు.
అయితే, రెండ్రోజుల కింద రేవంత్‌రెడ్డి పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పోలీసు సంఘం ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వద్ద విధులు నిర్వర్తిస్తున్న 2 ప్లస్ 2 గన్‌మెన్‌లు ఉన్నపళంగా బుధవారం రాత్రి నుంచి విధులకు రావడం ఆపేశారు. తనకు భద్రత తొలిగించినట్లు ఏలాంటి అధికారిక సమాచారం లేదని రేవంత్ రెడ్డి అనగా.. డీజీపీ అంజనీ కుమార్ మాత్రం తామేమీ రేవంత్ రెడ్డికి భద్రత తొలిగించలేదని స్పష్టం చేశారు.