తెలంగాణ మహిళలకు శుభవార్త అందింది. మహిళా సంఘాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్యం ఇచ్చే చీరలపై కీలక అప్డేట్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళ సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఉచితంగా చీరలు పంపిణీ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రంగం సిద్ధం చేసింది.
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలోని తన ఛాంబర్ లో చీరల డిజైన్లను పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కొక్కరికి ఏడాదికి రెండు చీరలు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి సర్కార్. అయితే.. ఈ ఉచితంగా ఇచ్చే చీరల ఉత్పత్తి ఎక్కడ చేస్తా రనేది సందేహం. సిరిసిల్లాలో చేయిస్తారా.. లేక.. నల్గొండ, వరంగల్ లాంటి ప్రాంతాల్లో చేయిస్తారా అనేది చూడాలి.
మహిళా సంఘాలకు ప్రభుత్యం ఇచ్చే చీరలివే..!
రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళ సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఉచితంగా చీరలు పంపిణీ
అసెంబ్లీలోని తన ఛాంబర్ లో చీరల డిజైన్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
ఒక్కొక్కరికి ఏడాదికి రెండు చీరలు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం@revanth_anumula… pic.twitter.com/542AnbfRtN
— BIG TV Breaking News (@bigtvtelugu) December 18, 2024