Revanth Reddy shock to Minister Seethakka: తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్కకు రేవంత్ రెడ్డి సర్కార్ షాక్ ఇచ్చింది. ఆదివాసి, గిరిజన మంత్రికి, ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో విలువ లేనట్టుగా వ్యవహరించింది రేవంత్ రెడ్డి సర్కార్.
ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 9న సెలవు దినంగా ప్రకటించాలని గత నెల జూలై 25న ఆదివాసి, గిరిజన మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆదివాసి, గిరిజన మంత్రి, ఎమ్మెల్యేలు నిరాశ చెందినట్టు సమాచారం.
అటు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకొని ఆదివాసీ గిరిజనులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. మూలవాసులుగా అమ్మలాంటి అడవికి తోడుండే భూమి పుత్రులు ఆదివాసులు అన్నారు మంత్రి సీతక్క. కల్మశంలేని అనుబంధాలకు ప్రతీకలు ఆదివాసీలు అన్నారు మంత్రి సీతక్క. గిరిజనుల హక్కుల పరిరక్షణకు,సంక్షేమాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు మంత్రి సీతక్క.