కాంగ్రెస్ పార్టీపై పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి అలిగినట్లు సమాచారం అందుతోంది. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ అలిగారట రేవంత్ రెడ్డి. తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిపోయారట రేవంత్ రెడ్డి. తమకే సీట్లు అనుకున్న సీనియర్లకు తుది జాబితాలో సీట్లు లేకపోవడం.. బీసీలకు 34 సీట్లు కేటాయించకపోవడంపై స్క్రీనింగ్ కమిటీ సభ్యుల ఆందోళనకు దిగారు.
ఈ తరుణంలోనే… తుది జాబితాపై రేవంత్, ఇతర సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రేవంత్ తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న స్క్రీనింగ్ కమిటీ సభ్యులు, రాహుల్ దగ్గరే తేల్చుకుంటామని పేర్కొన్నారట స్క్రీనింగ్ కమిటీ సభ్యులు. దీంతో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ అలిగారట రేవంత్ రెడ్డి.
కాగా, ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. నవంబర్ 3వ తేదీన తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ.. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 15.. నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు ఉంటాయని ఈసీ ప్రకటించింది.