ఈనెల 15 నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర

-

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌  ిర్వహించనున్న బస్సు యాత్రకు షెడ్యూల్ విడుదలైంది. ఈ యాత్రను ఆలంపూర్‌ నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 15వ తేదీన కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ ఈ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. మరుసటి రోజు బస్సు యాత్రలో ఆమె పాల్గొంటారని పీసీసీ వర్గాలు తెలిపాయి.

18,19వ తేదీలల్లో రాహుల్‌ గాంధీ, 20, 21 తేదీలల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే బస్సు యాత్రలో పాల్గొంటారని  పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించి  రేపటి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రూట్‌ మ్యాప్‌తోపాటు ఇతర అంశాలపై చర్చించనున్నారు. మూడు రకాల రూట్‌ మ్యాప్‌లు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూడింటిని రేపటి సమావేశంలో చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. పీఏసీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు బయటకు బహిర్గతమైతే…ఇబ్బంది ఉంటుందని భావించిన పీసీసీ… గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది రేపు పీఏసీ సమావేశం ముగిసిన తరువాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version