యూపీఐ చెల్లింపులపై సర్​ఛార్జీలు.. మోదీ కుటిల నీతికి నిదర్శనం : రేవంత్ రెడ్డి

-

యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేయాలన్న కేంద్రం నిర్ణయంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం సామాన్యులను దోచుకోవడానికి మరో దారి వెతుక్కుందని ఆరోపించారు. ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఛార్జీలు అమలులోకి వస్తాయని UPI ఇచ్చిన సర్క్యులర్‌ రేవంత్‌ ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు.

పారదర్శక చెల్లింపుల పేరుతో ప్రజలను ఆన్‌లైన్‌కు అలవాటు చేసిన కేంద్రం ఇప్పుడు వాటిపై 1.1 శాతం రుసుము వసూలు చేయటం మోదీ కుటిల నీతికి నిదర్శనమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏటా 10లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయని వాటిపై 11వేల కోట్లు అదనంగా ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. మోదీ హఠావో- దేశ్‌ బచావో అంటూ రేవంత్‌ ట్వీట్‌ చేశారు.

యూపీఐ ద్వారా రూ.2000కన్నా ఎక్కువ మొత్తం బదిలీ చేస్తే.. లావాదేవీ విలువలో 1.1శాతం సుంకం విధించనున్నట్లు ఎన్​సీపీఐ తెలిపింది. సెప్టెంబర్ 30 నాటికి ఈ ఛార్జీపై సమీక్షిస్తామని చెప్పింది. ట్రాన్సాక్షన్​ ఆమోదించడం, ప్రాసెస్ చేయడం, పూర్తి చేయడానికి సంబంధించిన ఖర్చుల దృష్ట్యా ఈ సర్​ఛార్జ్ విధిస్తున్నట్లు జాతీయ చెల్లింపుల సంస్థ- ఎన్​పీసీఐ స్పష్టం చేసింది. కొత్త నిబంధనలు ఏప్రిల్ 1న అమల్లోకి వస్తాయని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news