తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరు గురవింద గింజలా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. వరుస ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ నిరాశలో కూరుకుపోయిందని తెలిపారు. మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదన్నారు. ప్రధాని కావాలనే రాహుల్ గాంధీ కల నెరవేరకపోవడం వల్ల ఏం చేయాలో తెలియక పిచ్చి పట్టినట్టు మా ప్రభుత్వం పై బురదజల్లుతున్నారని విమర్శించారు.
రాహుల్ గాంధీ ఏ మాత్రం అవగాహన లేకుండా మిడి మిడి జ్ఞానంతో వ్యవహరిస్తున్నారు. వర్థమాన రాజకీయాల గురించి అవగాహన లేదు. దేనిపై రాహుల్ గాంధీకి అవగాహన లేదు. అవగాహన లేని వ్యక్తి కాంగ్రెస్ పార్టీని ఎలా నడుపుతున్నాడో స్వయంగా మనం చూస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఆధారాలు చూపకుండా గాలి మాటలు మాట్లాడితే.. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. అదానీ కుదుర్చుకున్న రూ.100 కోట్ల ఒప్పందం పై రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.