100 కోట్లతో మేడిగడ్డ రిపేర్ కు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. ఈ రోజు మద్యాహ్నం సచివాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజిల మరమత్తులపై సిఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం ఉండనుంది. ఈ సమావేశానికి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిలకు చేపట్టాల్సిన మరమత్తులపై కీలక చర్చ ఉండనుంది.
ఇవాళ్టి సమావేశంలో మరమత్తులకు ఆమోద ముద్ర వేయనున్నారట సిఎం రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం చంద్రశేఖర్ అయ్యర్ అధ్వర్యంలో నియమించిన NDSA నిపుణుల కమిటి ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక అందజేశారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే అత్యవసరంగా మరమత్తులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారట.దాదాపు 100 కోట్ల రూపాయల నిధులు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే… 100 కోట్లతో మేడిగడ్డ రిపేర్ కు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం.