కాంగ్రెస్ అంటే నమ్మకం.. కేసీఆర్ అంటే అమ్మకం : రేవంత్ రెడ్డి

-

తెలంగాణలోని పాలకుర్తి నియోజకవర్గంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సభలో మాట్లాడారు రేవంత్ రెడ్డి. ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం.. 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తే తాను నామినేషన్ వెనక్కి తీసుకుంటాను. ఇవ్వకుంటే వరంగల్ లో జయశంకర్ విగ్రహం వద్ద కేసీఆర్ ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పాలకుర్తి అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. ఎర్రబెల్లి మోసాలకు ఈనెల 30న బుద్ది చెప్పాలి. ఈ ఎన్నికల్లో ఎర్రబెల్లిని బొందపెట్టాలన్నారు.

రాజ్యసభ సీట్లు కేసీఆర్ వందల కోట్లకు అమ్ముకున్నారు. కాంగ్రెస్ అంటే నమ్మకం.. కేసీఆర్ అంటే అమ్మకం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. దయాకర్ రావుకు వేల ఎకరాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. డిసెంబర్ 09న వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు రేవంత్ రెడ్డి. నన్ను జైలులో పెట్టించిందే ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు రేవంత్ రెడ్డి. పాలకుర్తి అంటేనే పౌరుషాలకు ఫేమస్ అని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news