33 జిల్లాల్లోంచి సీఎం రేవంత్‌ 16 తీసెయ్యాలని చూస్తున్నారు : కేటీఆర్

-

ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు పది పన్నెండు సీట్లు కట్టబెడితే.. రాబోయే ఆరు నెలల్లో కేసీఆర్‌ రాష్ట్రాన్ని శాసించే పరిస్థితి తప్పక వస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లోంచి  16 జిల్లాలను తీసెయ్యాలని చూస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్‌ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌ కుమార్‌కు మద్దతుగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్, గాంధీ చౌక్, కొత్త బస్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఉన్న పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించి, కార్నర్ మీటింగ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌, బీజేపీలపై కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు పదేపదే నమో నమో అంటున్నారని… నమో అంటే నరేంద్రమోదీ కాదు… నమో అంటే నమ్మించి మోసం చేయడం అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్లు పేదలను పీడించి పెద్దలకు లబ్ధి చేకూర్చిన ఘతన మోదీకె దక్కుతుందని కేటీఆర్‌ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news