28 జిల్లాలో డీఆర్‌ఓలు లేరా.. మరి పాలన ఎలా..?

-

రాష్ట్రంలోని 28 జిల్లాలో డీఆర్‌ఓ (డిస్ట్రిక్‌ రెవెన్యూ ఆఫీసర్‌) లేక రెవెన్యూ పాలలో స్తబ్దత ఏర్పడుతోంది. పోటీ పరీక్షల యంత్రాంగాన్ని సిద్ధం చేయడం, భూముల విచారణ కమిటీల ఏర్పాటు, కలెక్టరేట్‌లోని వివిధ విభాగాల విధులు, ఎన్నికల నిర్వహణ ఇలాంటివి జిల్లా రెవెన్యూ పాలనలో అత్యంత కీలక స్థానం డిస్ట్రిక్‌ రెవెన్యూ ఆఫిసర్‌ (డీఆర్‌ఓ)లదే ఉంటుంది. సిట్టింగ్‌ కలెక్టర్‌ హోదాలో ఉండే ఈ పోస్టులపై రెండేళ్లుగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో దిగువ స్థాయి అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించి పనులు కానిచ్చేస్తున్నారు. దీనికి తోడు భూవివాదాల పరిష్కారం కోసం నూతనంగా ఏర్పాటు చేస్తున్న జిల్లా ట్రైబ్యునళ్లలో అదనపు కలెక్టర్‌ లేకపోతే డీఆర్‌ఓలను నియమిస్తున్నారు. దీంతో పరిపాలన విభాగంపై మరింత ఒత్తిడి చూపే అవకాశం ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

పరిష్కారం ఎలా..

ఆయా జిల్లాల కలెక్టరేట్లలో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు, వినతులు స్వీకరిస్తారు. కలెక్టర్ల ఆదేశాలతో సంబంధిత శాఖలకు ఆ దరఖాస్తులు పంపి వాటికి పరిష్కారం లభించేలా డీఆర్‌ఓలు సమన్వయం చేస్తుంటారు. కలెక్టర్, అదనపు కలెక్టర్లకు చేదోడుగా ఉండి ఉత్తర్వులు జారీ చేసే బాధ్యతలు సైతం డీఆర్‌ఓలు నిర్వహిస్తుంటారు. జిల్లా పాలన విభాగంలో కీలకపాత్ర వహించే డీఆర్‌ఓల పోస్టుల ఖాళీలతో పరిపాలన విభాగంలో ఒత్తిడి, ఇబ్బందులు తలెత్తుతున్నాయి. స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ క్యాడర్‌ ఉన అధికారులతో డీఆర్‌ఓ మరియు అదనపు కలెక్టర్‌ పోస్టులను భర్తీ చేస్తారు. అయితే తెలంగాణలో 40 స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news