యాసంగి సాగుకు నీటి విడుదలపై ఇవాళ అధికారుల భేటీ

-

యాసంగి సాగు మొదలైంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నారుమడులు తయారు చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా నాటు వేయడం కూడా షురూ చేశారు. ఈ క్రమంలోనే యాసంగి సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కూడా విడుదల చేసింది. ఇక మరోవైపు యాసంగి సాగుకు నీటి విడుదలకు సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది.

ఈ క్రమంలోనే యాసంగి సాగుకు నీటి విడుదల ప్రణాళికపై చర్చించేందుకు రాష్ట్రస్థాయి సమీకృత నీటి ప్రణాళిక- యాజమాన్య కమిటీ ఇవాళ భేటీ కానుంది. హైదరాబాద్‌లోని జల సౌధలో నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రాజెక్టుల్లోని నీటి నిల్వలు, విడుదల ప్రణాళికపై చర్చించనున్నారు.

వానా కాలంలో కృష్ణా ప్రాజెక్టుల్లోకి ఆశించినంత నీరు రాలేదు. జూరాల మినహా శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల్లో తాగునీటికి సరిపడా మాత్రమే నీరుంది. యాసంగికి నీటి విడుదల లేనట్లేనని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు గోదావరి ప్రాజెక్టులు ఈ ఏడాది మూడుసార్లు పొంగిపొర్లాయి. శ్రీరాంసాగ్‌ర్‌, నిజాంసాగర్‌, శ్రీపాద ఎల్లంపల్లి తదితర జలాశయాల్లో డెడ్‌స్టోరేజీ, తాగునీటి అవసరాలు పోనూ యాసంగి ఆయకట్టుకు ఇవ్వాల్సిన నీళ్లపై భేటీలో నిర్ణయించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news