రేవంత్ రెడ్డి కర్ర సాము..వీడియో వైరల్

-

రేవంత్ రెడ్డి తెలంగాణలో చురుకైన రాజకీయ నాయకుడు. మహబూబ్ నగర్ కు చెందిన రేవంత్ రెడ్డి చిన్ననాటినుంచే రాజకీయాల పట్ల ఆసక్తి కనబరిచేవారు. ఎప్పుడు రాజకీయాలతో బిజీగా ఉండే రాజకీయ నాయకులు స్టెప్పులు వేస్తే ఓ రేంజ్ లో ఉంటుంది. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కర్రసాముతో కిర్రెక్కించారు. కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోని రేవంత్ రెడ్డి అన్న కొడుకు వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి.

revanth reddy

ఈ పెళ్లి వేడుకలో తీన్మార్ డప్పులకు కర్ర సాము చేస్తున్న రేవంత్ రెడ్డి ని చూసి అందరూ షాక్ అయ్యారు. అయితే గ్రాడ్యుయేషన్ చదువుతున్న సమయంలో ఆయన అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకుడిగా ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏ.వీ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు జైపాల్ రెడ్డి మేనకోడలు గీతాను వివాహమాడారు. అయితే తాజాగా రేవంత్ రెడ్డి తన అన్న కొడుకు వివాహ వేడుకల్లో తీన్మార్ డప్పులకు కర్రసాము చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news