గజ్వేల్ శివారులో రోడ్డు ప్రమాదం..కారులో చెలరేగిన మంటలు

-

 

సిద్దిపేట జిల్లా గజ్వేల్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గజ్వేల్ శివారులో రాజీవ్ రహదారిపై ఈ ప్రమాదం జరుగగా.. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు గుర్తించారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ వెళ్తూ వేగంగా వచ్చి చెట్టును ఢీ కొట్టింది కారు.

Road accident in the suburbs of Gajwel..The car caught fire

అయితే.. ఈ ప్రమాదం జరిగిన క్షణాల్లోనే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటల్లో పూర్తిగా దగ్దమైంది కారు. అయితే.. ప్రయాణికులు కారు నుంచి దిగడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version