కాంగ్రెస్ అధిష్టానం పై జీవన్ రెడ్డి అసంతృప్తి.. ఈసారి ఈ షాకింగ్ నిర్ణయం తప్పదా..?

-

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. పార్టీలో గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారా..? నియోజకవర్గంలో ఆయన చెప్పిన పనులేమి జరగడం లేదా..? ఎమ్మెల్యే సంజయ్ కి ఆయనకి మధ్య ఆధిపత్యం కొనసాగుతూనే ఉందా..? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారట.. జగిత్యాల ఎమ్మెల్యే గా ఉన్న డాక్టర్ సంజయ్ ని పార్టీ లోకి తీసుకున్నప్పటినుంచి ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది..

గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న జీవన్ రెడ్డి.. మరోసారి తన అసంతృప్త రాగాలను ఆలపిస్తున్నారట.. తన ఆధిపత్యానికి ఎమ్మెల్యే సంజయ్ గండి కొడుతున్నారని.. తన అనుచరులను ఇబ్బంది పెడుతున్నారని జీవన్ రెడ్డి లోలోనా మదన పడుతున్నారట.. అనుచరులు ఏర్పాటు ఏర్పాటు చేసిన తన ఫ్లెక్సీలు సైతం ఎమ్మెల్యే వర్గం తొలగించేసిందని.. అధిష్టానానికి అయన ఫిర్యాదు చేసినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.. జీవన్ రెడ్డి వర్గానికి అసలు పనులే జరగడం లేదట.. ఈ వ్యవహారం అంతా ఆయనకి ఇబ్బందికరంగా మారిందని ఆయన అనుచరులు చెబుతున్నారు.. ఈ క్రమంలోనే నామినెటెడ్ పదవులు పందేరాన్ని ఎమ్మెల్యే సంజయ్ తో పాటు.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది..

నామినేటెడ్ పదవుల్లో పార్టీకోసం పనిచేసిన వారికి నామినెటెడ్ పదవులు ఇప్పించేందుకు జీవన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారట.. ఇప్పటికే పేర్లను కూడా సీఎం రేవంత్ రెడ్డికి పంపారట.. అయితే ఎమ్మెల్యే సంజయ్ కూడా తన వర్గానికి చెందిన వారి పేర్లను ప్రతిపాదించడంతో ఎవరికి అధిష్టానం ప్రాధాన్యత ఇస్తుందో అన్న చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది.. జీవన్ రెడ్డి మాట నెగ్గకపోతే మాత్రం ఆయన కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముందని ఆయన వర్గం నేతలు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా.. జీవన్ రెడ్డి భవితవ్యం ఏంటో చూడాలి మరి..

Read more RELATED
Recommended to you

Latest news