ఆషాడ బోనాల నిర్వహణకు రూ.250 కోట్లు – మంత్రి తలసాని

-

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ. ప్రతి ఏడాది ఆషాడ మాసంలో తెలంగాణలో బోనాల పండుగ నిర్వహిస్తారు. పల్లె నుండి పట్నం వరకు ఆషాడ మాసంలోని ప్రతి ఆదివారం, గురువారం గ్రామదేవతలకు బోనం సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా ఆషాడ బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సాలార్జంగ్ మ్యూజియంలో అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వచ్చే నెల 16న పాత బస్తీలో జరిగే ఆషాడ బోనాల నిర్వహణకు రూ.250 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ సంస్కృతికి ప్రత్యేకగా నిలిచే బోనాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను సంబురంగా నిర్వహించుకుంటున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news