కేసీఆర్, మోదీ మధ్య రహస్య ఒప్పందం ఉంది: ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిజామాబాద్ సభలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కుంపటి పెట్టాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎన్డీఏలో చేరతానని తనను సంప్రదించారని మోదీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను బీఆర్ఎస్ మంత్రులు తిప్పికొడుతుంటే.. మరోవైపు బీజేపీ నేతలు గులాబీ నాయకులపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ.. బీజేపీ, బీఆఆర్ఎస్ రెండు పార్టీలు ఒక చెట్టు కొమ్మలేనంటూ విమర్శిస్తోంది.

ఈ నేపథ్యంలో బీఎస్పీ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కేసీఆర్, మోదీలు రహస్య ఒప్పంద ప్రకారం నడుచుకుంటున్నారని ఆరోపించారు. బహిర్గతంగా  వీరంతా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు తప్ప… అందులో వాస్తవం లేదన్నారు. కరీంనగర్‌ జిల్లా జమ్మింకుంటలో బహుజన గర్జన సభలో ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్న ఆయన.. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి పై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడడంలేదని ఆయన విమర్శించారు. లిక్కర్‌ స్కాంలో కల్వకుంట్ల కవితను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news