రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఎస్‌పీ – బీఆర్ఎస్ కూటమిలో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ తన అభ్యర్థులను నాగర్ కర్నూల్, హైదరాబాద్ నియోజకవర్గాల్లో బరిలోకి దించబోతున్న విషయం తెలిసిందే. మిగతా నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పోటీ చేయబోతుంది. తమ రెండు పార్టీలు అన్ని లోక్‌సభ స్థానాల్లో పూర్తి పరస్పర సహకారంతో విజయం దిశగా పయనించబోతున్నాయని బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
బీఎస్పీకి రెండు సీట్లు కేటాయించడంపై సోషల్ మీడియా వేదికగా ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఈ చారిత్రాత్మక ఒప్పందానికి అనుమతించిన బీఎస్‌స్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి, దేశంలో బహుజనుల రక్షణ కోసం ఈ పొత్తు ఒక చారిత్రాత్మక అవసరమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఈ లౌకిక కూటమి నిస్సందేహంగా విజయ దుందుభి మోగించబోతుందని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
It’s Official now. #BSP is going to fight General Elections-2024 in two(2) seats, NagarKurnool (SC) and Hyderabad(Gen) in Telangana. #BRS is going to field its candidates in remaining constituencies. Both the parties are going to work together for victory in all the…
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 15, 2024