గుండె లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – RS ప్రవీణ్ కుమార్

-

గుండె లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ RS ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. భువనగిరి సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్‌ తిని మరణించిన ప్రశాంత్‌ సంఘటనపై RS ప్రవీణ్ కుమార్ పోస్ట్‌ పెట్టారు. భువనగిరి సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్‌ తిని మరణించిన ప్రశాంత్‌ మృతి దేహం ఫోటో షేర్‌ చేసి మరీ… సీఎం రేవంత్‌ రెడ్డిపై సీరియస్‌ కామెంట్స్‌ చేశారు.

RS praveen kumar slams cm revanth

ఈ బాడీ బ్యాగ్ లో ఉన్నది భువనగిరి సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదుకోవాలని ఒక డాక్టరో ఇంజనీరో కావాలని వచ్చి అక్కడి విషాహారం తిని విగతజీవుడైన బాలుడు ప్రశాంత్ అంటూ పేర్కొన్నారు. ఈ శాఖా మంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారేనని ఆగ్రహించారు. ఇదే భువనగిరిలో గత 2 నెలల క్రితం ఇద్దరు పేద అమ్మాయిలు సంక్షేమ హాస్టల్లో ఉరి వేసుకొని చనిపోయారని గుర్తు చేశారు. ఆనాడు, ఈ నాడు స్పందించని గుండె లేని నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా ఉండాల్నా?
ఒక్క సారి ఆలోచించండని అంటూ పిలుపునిచ్చారు RS ప్రవీణ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news