రూ. 1,100 కోట్ల తో వ‌రంగ‌ల్ లో సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి

-

వ‌రంగ‌ల్ జిల్లా లో మ‌ల్టీ స్పెషాలిటీ ఆస్ప‌త్రి నిర్మాణం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం రూ. 1,100 కోట్ల ను విడుద‌ల చేసింది. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వుల ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రిజ్వీ జారీ చేశారు. అయితే వ‌రంగల్ నిర్మించ బోతున్న ఈ మ‌ల్టీ స్పెషాలిటీ ఆస్ప‌త్రి లో 2 వేల ప‌డ‌క‌ల ను ఏర్పాటు చేయ‌నుంది. కాగ గ‌తంలో వ‌రంగల్ లో మ‌ల్టీ స్పెషాలిటీ ఆస్ప‌త్రి నిర్మిస్తామ‌ని గ‌తం లో ముఖ్య మంత్రి కేసీఆర్ హామీ ని ఇచ్చాడు.

అందు లో భాగం గా నే రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ రోజు రూ. 1,100 కోట్ల ను విడుద‌ల చేసింది. అయితే ఈ నిధుల‌తో TSMIDC, DME ఆధ్వ‌ర్యం లో ప‌లు ర‌కాల ప‌నులు చేపట్టాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశించింది. ఈ నిధుల తో వ‌రంగ‌ల్ లో మ‌ల్టీ స్పెషాలిటీ ఆస్ప‌త్రి కి సంబంధించి సివిల్ వ‌ర్క్స్, మెకానిక‌ల్, ఎల‌క్ట్రిసిటి, ఫ్లంబింగ్ తో పాటు వైద్య ప‌రికరాలు, పారిశుధ్యం, మంచి నీరు వంటి ప‌నులు చేప‌ట్టాల‌ని చేయాల‌ని అధికారుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news