మహారాష్ట్రలో ఓమిక్రాన్ కేసు నమోదు.. ఇండియాలో నాలుగుకు చేరిన ఓమిక్రాన్ కేసులు

-

ఓమిక్రాన్ కేసులు భారత్ ను భయపెడుతోంది. ఇప్పుడిప్పుడే కరోనా భారత్ లో తగ్గుముఖం పడుతుంటే.. ఓ వైపు ఓమిక్రాన్ కేసులు భయపెడుతున్నాయి. దక్షిణాఫ్రికాలో మొదలైన కరోనా ఓమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం 39 దేశాలకు వ్యాపించింది. ఈ జాబితాలో ఇండియా కూడా ఉంది.

ఇప్పటికే ఇండియాలో కర్ణాటకలో 2, గుజరాత్ లో 1 చొప్పున ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మహారాష్ట్రలో కూడా ఒక ఓమిక్రాన్ కేసు నమోదవ్వడం కలకలం రేపుతోంది. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్ మీదుగా ముంబైకి వచ్చిన ఓ ప్రయాణికుడికి ఓమిక్రాన్ వేరియంట్ కరోనా సోకినట్లు నిర్థారించారు. ఇవ్వాల ఒకే రోజు ఇండియాలో రెండు ఓమిక్రాన్ కేసులు నమోదయ్యయి. దీంతో ఇండియాలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 4 కు చేరింది.

వీరంతా ఇతర దేశాల నుంచి ఇండియాకు రావడం..ముఖ్యంగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే నుంచి రావడంతో వారిలో ఓమిక్రాన్ వేరియంట్ బయటపడింది. ప్రస్తుతం వందల సంఖ్యలో రిస్క్ దేశాల నుంచి ప్రయాణికులు ఇండియాకు చేరారు. వీరిలో కొంత మందికి కరోనా పాజిటివ్ రావడంతో వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబులకు పంపారు. వీటి ఫలితాలు వస్తే మరెంత మంది ఓమిక్రాన్ బారిన పడ్డారో తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news