ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ఢీ కొనడంతో మూడు ముక్కలుగా విడిపోయింది ట్రాక్టర్.. ఇద్దరూ డ్రైవర్లు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటన బుధవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్రియాల శివారు పెట్రోల్ బంక్ వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ కి వెళ్తున్న క్రమంలో కట్రియాల గ్రామ శివారులో ని పెట్రోల్ బంక్ సమీపంలో ట్రాక్టర్ బస్సు ఒక్కసారిగా ఢీ కొన్నాయి.
దీంతో ట్రాక్టర్ మూడు ముక్కలు అయి చెల్లాచెదురుగా పడింది. ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్ డ్రైవర్ వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన సుంకరి శ్రీను గా
గుర్తించారు. పండుగ వేళ బందువుల ఇంటికి బస్సులో వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరగడంతో
ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో బస్సు అద్దాలు ముందు భాగం
ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.