ఆదివారం రాత్రి బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ ప్రకటించిన తర్వాత ఆ షోలోని పరుగుల కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ రోడ్లపై హంగామా సృష్టించారు. కృష్ణానగర్ లోని అన్నపూర్ణ స్టూడియో వద్దకు భారీ ఎత్తున వచ్చిన బిగ్ బాస్ అభిమానులు రచ్చ చేస్తూ ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు. దీంతో ఆర్టీసీ ఎండీ సజ్జన్ ఆర్ ట్విట్టర్ వేదికగా బిగ్ బాస్ అభిమానులపై ఫైర్ అయ్యారు.
సజ్జనార్తన స్వీట్లు హైదరాబాదులోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి ఆర్టీసీకి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు ఈ దారిలో ఆరు బస్సులు అద్దాలు ధ్వంసం అయ్యాయి ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేస్తాను సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడం అంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టిఎస్ఆర్టిసి యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించడు. టిఎస్ఆర్టిసి బస్సులు ప్రజల ఆస్తి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఆర్టీసీ ఎండీ సజ్జన ట్విట్టర్లో పేర్కొన్నారు.