జేబీఎస్ లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అకస్మిక తనిఖీ

-

ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రవేశ పెట్టగానే రద్దీ పెరిగిందని, అందుకు అనుగుణంగా బస్సులను నడిపేందుకు ప్లాన్ రూపొందించామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. హైదరాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ ను సోమవారం ఎండీ వీసీ సజ్జనార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు తీరుపై ఆయన క్షేత్ర పరిశీలన చేశారు. అనంతరం జేబీఎస్- వెంకట్ రెడ్డి నగర్ సిటీ ఆర్డినరీ బస్సులో మెట్టుగూడా వరకు ప్రయాణించారు.


అందులో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మంచి స్పందన వస్తోందన్నారు. రద్దీ సమయాల్లో ప్రయాణికులు కొంత సమయనం పాటించి, సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా చిన్నపాటి పొరపాట్లు జరిగితే ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకురావాలని, 24 గంటలు అందుబాటులో ఉండే సంస్థ కాల్ నంబర్లైన 040-69440000,040-23450033 ఫోన్ చేసి చెప్పొచ్చు అన్నారు.

మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఉచిత బస్ ప్రయాణ స్కీమ్ కు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసి, వాటిపై 40 వేల మంది సిబ్బందికి అవగాహన కల్పించామని గుర్తు చేశారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ స్థానికతను నిర్ధారించుకునేందుకు తమ ఆధార్ కార్డులను సిబ్బందికి చూపించి, సంస్థకు సహకరించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news