ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం సరికాదు : వినోద్ కుమార్

-

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వారిపట్ల వినయంగా ఉండాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన భవనాలు, శిలాఫలకాలను కూల్చడం పట్ల ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో భవనాలు నిర్మిస్తే కూల్చేస్తారా? అని నిలదీశారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం సరికాదని.. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు చాలా తప్పులు ఎత్తి చూపించారు. రానున్న రోజుల్లో అసెంబ్లీలో వాటిపై నిలదీస్తాం. సమస్యలు ఎంత వరకు పరిష్కరిస్తున్నారో ఖచ్చితంగా అడుగుతాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, కాంగ్రెస్ ఏర్పాటు శిలాఫలకాలను తెలంగాణ ఏర్పాడిన తర్వాత బీఆర్ఎస్  ప్రభుత్వం కూల్చేసిందా? ఇదెక్కడి విపరీత ధోరణి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి దీనిపై సమాధానం చెప్పాలి అని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news